: ఇటలీని తాకిన భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రత
ఈ ఉదయం సెంట్రల్ ఇటలీ భారీ భూకంపంతో వణికిపోయింది. దేశంలోని ప్రధాన పట్టణాల్లో ఒకటైన పెరూజియాకు 68 కిలోమీటర్ల దూరంలో ఉపరితలానికి 108 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని యూఎస్ జియోలాజికల్ విభాగం అధికారులు తెలిపారు. దీని తీవ్రత 7.1గా నమోదైందని వివరించారు. భూకంపం కారణంగా సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టాలపై ఇప్పటివరకూ ఎలాంటి సమాచారమూ వెలువడలేదు. ప్రకంపనల తీవ్రత రాజధాని రోమ్ నగరాన్ని సైతం తాకింది. కాగా, రెండు నెలల క్రితం దాదాపు ఇదే తీవ్రతతో వచ్చిన భూకంపం 300 మందిని పొట్టన బెట్టుకున్న సంగతి తెలిసిందే.