: 'నేను పెళ్లిచేసుకున్నా'... హౌస్ ఫుల్-2 ఫేమ్ లీసా హేడెన్


గడచిన ఏడాదిగా డేటింగ్ చేస్తున్న ప్రియుడు డినో లాల్వానీని తాను వివాహం చేసుకున్నట్టు 'హౌస్‌ ఫుల్‌-2', 'క్వీన్‌', ‘యే దిల్‌ హై ముష్కిల్‌’ చిత్రాల ఫేం, హీరోయిన్ లీసా హేడెన్ వెల్లడించింది. తనకు వివాహమైన విషయాన్ని స్పష్టం చేస్తూ, ఇన్ స్టాగ్రామ్ లో పెళ్లి ఫోటోలను పంచుకోగా, ఇప్పుడవి వైరల్ అవుతున్నాయి. చెన్నైలో పుట్టినప్పటికీ, విదేశాల్లోనే ఎక్కువగా గడుపుతూ వచ్చిన లిసా, పాక్ లో జన్మించిన బ్రిటన్ వ్యాపారి గుల్లూ లల్వానీ కుమారుడు డినోతో లవ్ లో పడిన సంగతి తెలిసిందే. లండన్ లో హాలోవిన్ బాల్ కార్యక్రమంలో వీరిద్దరికీ పరిచయం కాగా, అది ప్రేమగా మారి, ఇప్పుడు వివాహ బంధమైంది. కొత్త జంటకు పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేశారు.

  • Loading...

More Telugu News