: నా భార్య మాత్రం ఎన్నడూ బరిలోకి దిగదు: బరాక్ ఒబామా


అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ భార్యగా హిల్లరీ క్లింటన్, ప్రస్తుత ఎన్నికల్లో అదే పదవికి పోటీ పడుతున్న వేళ, బరాక్ ఒబామా కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో తన భార్య మిచెల్లీ అధ్యక్ష పదవి కోసం పోటీ చేయబోదని, ఆమెకు రాజకీయాలంటే ఇష్టం ఉండదని, పదవులపై మోజు లేదని చెప్పారు. నార్త్ కరోలినాలో హిల్లరీకి మద్దతుగా జరిగిన ఓ ప్రచార కార్యక్రమంలో హిల్లరీకి బదులుగా మిచెల్లీ పేరుతో నినాదాలు మారుమోగి పోయాయి. అనంతరం ఒబామా స్పందిస్తూ, అధ్యక్షురాలికి ఉండాల్సినంత ఓపిక తన సతీమణికి లేదని, ఆమెకు రాజకీయాలపై ఆసక్తి కూడా లేదని చెప్పారు. తన భార్య తెలివైనదని, ఎంతో నేర్పరి అని కొనియాడిన ఒబామా, ఆమెను చూస్తే గర్వంగా అనిపిస్తుందని తెలిపారు.

  • Loading...

More Telugu News