: సోనియా వెనుక వాజ్ పేయి, పీవీ... పాత ఫోటో చూపి జోకులేసిన వర్మ
తన మనసుకు తోచిందే తప్ప ఇతరుల భావోద్వేగాలను పట్టించుకోని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ దఫా ఇద్దరు మాజీ ప్రధానులు వాజ్ పేయి, పీవీ నరసింహరావు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీలను లక్ష్యంగా చేసుకుని జోకులేశారు. సోనియా ముందు కూర్చుని ఉండగా, వెనుక బెంచీలో వాజ్ పేయి, పీవీ నరసింహరావులు కూర్చున్న పాత ఫోటోను ఫేస్ బుక్ లో షేర్ చేసుకుంటూ, బ్యాక్ బెంచీలో కూర్చున్న వారంతా చెడ్డవారేనని, వీరు ఎవరో తనకు తెలియదుగానీ, ఒకరిని మించి మరొకరు చెడ్డవారిలా కనిపిస్తున్నారని అన్నాడు. ఇదే ఫోటోను మరోసారి పోస్ట్ చేస్తూ, ఈ వ్యక్తులు మహిళలను అగౌరవంగా చూస్తున్నట్టుందని, వీరెవరో పోలీసులు విచారణ జరిపించాలని డిమాండ్ చేశాడు. ఆపై నిమిషాల వ్యవధిలో మూడోసారి పోస్ట్ చేస్తూ, వీరంతా తమ ముందు హుందాగా కూర్చున్న ఓ మహిళపై డర్టీ జోక్స్ వేస్తున్నట్టుందని, ఇది తనకు షాక్ కలిగిస్తోందని చెప్పాడు. ఇక వర్మ తాజా పోస్టులపై నెటిజన్లు మండిపడుతున్నారు.