: ఆదరణ తగ్గని చంద్రబాబును వదిలి ఫాంహౌస్ లో నిద్రపోయే సీఎంకు తొలి స్థానమా?: మండిపడ్డ తెదేపా


దేశంలో అత్యంత జనాదరణ పొందిన ముఖ్యమంత్రుల జాబితాను ఓ ప్రైవేటు సంస్థ విడుదల చేయగా, ఆ కంపెనీ విశ్వసనీయతను తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది. ఫాంహౌస్ కు పరిమితమైన సీఎంకు మొదటి స్థానం ఇచ్చారని, రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలూ శ్రమిస్తున్న చంద్రబాబుకు 8వ స్థానం ఏంటని ఆ పార్టీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు అడిగారు. వీడీపీ అనే కంపెనీ పేరును కూడా తాను వినలేదని, అది ఓ నిద్రపోయే సంస్థని విమర్శించారు. దేశ సగటు వృద్ధి కన్నా ఏపీ వృద్ధి అధికమని, సులువుగా వ్యాపారం నిర్వహించదగ్గ రాష్ట్రాల్లో తెలంగాణతో పాటు ఏపీ పేరు కూడా ఉందని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబుకు ప్రజాదరణ తక్కువగా ఉందని ఎలా చెప్పగలుగుతారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలతో పోలిస్తే, ఏపీ వేగంగా అభివృద్ధి పథంలో సాగుతోందని తెలిపారు. ప్రపంచబ్యాంకు చేసిన అధ్యయనంలో రాష్ట్రానికి మొదటి స్థానం దక్కిందని గాలి గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News