: విచిత్రం... ఆ ఫోన్ నెంబర్‌ వాడినవారంతా చనిపోతున్నారు!


బల్గేరియాలోని మొబిటెల్‌ అనే సంస్థకు చెందిన ఓ ఫ్యాన్సీ ఫోన్ నెంబరును వాడిన వారంతా చ‌నిపోతున్నారు. సినిమా సీన్ల‌ను త‌ల‌పించేలా ఈ ఘ‌ట‌న జ‌రుగుతుండ‌డంతో ఇప్పుడు ఆ నెంబరు గురించే అంద‌రూ మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఆ నెంబర్ ఎంత అంటే.. 0888888888. ఈ నెంబ‌రును తొలిసారిగా మొబిటెల్‌ సంస్థ సీఈవో వ్లాదిమిర్‌ గ్రాస్నవ్ వాడారు. 2001లో ఆయ‌న‌ కేన్సర్‌తో ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆయ‌న చ‌నిపోయిన కార‌ణం వేరే ఉంద‌ని, బిజినెస్‌లో కలహాలు, హానికారక రేడియో యాక్టివ్‌ పాయిజనింగ్ వ‌ల్లే ఆయ‌న మృత్యువాత ప‌డ్డార‌ని అక్క‌డి మీడియా పేర్కొంది. అనంత‌రం ఆ నెంబ‌రును 2003లో కాన్‌స్టాంటిన్‌ డిమిట్రోవ్‌ అనే మాఫియా డాన్ వినియోగించాడు. అదే స‌మ‌యంలో అతను ఒక గుర్తు తెలియ‌ని వ్య‌క్తి చేతిలో హ‌త‌మ‌య్యాడు. ఆ త‌రువాత ఆ ఫ్యాన్సీ నెంబరు 2005లో దిష్‌లీవ్‌ అనే బిజినెస్ మేన్ ఉప‌యోగించాడు. అదే సంవ‌త్స‌రంలో బల్గేరియా రాజధాని సోఫియాలో ఆయ‌న‌ను ప‌లువురు హత్య చేశారు. దిష్‌లీవ్ కు మ‌త్తుప‌దార్థాలు తరలించే వ్యాపారం కూడా ఉండేది. దీంతో ఈ నెంబరును సద‌రు సంస్థ బ్లాక్ చేసింది. ఆ త‌రువాత ఈ నెంబ‌రును ఎవ్వ‌రూ ఉప‌యోగించ‌లేదు. ఈ ఫ్యాన్సీ నెంబ‌రుకు ఇప్పుడు కాల్‌ చేస్తే ‘అవుట్‌ సైడ్‌ నెట్‌వర్క్‌ కవరేజ్‌’ అని వినిపిస్తోంది. ఈ నెంబ‌రు వాడితే ఎందుకు మ‌ర‌ణిస్తున్నార‌ని స‌ద‌రు సంస్థ‌ను అడిగితే ఈ విష‌యంపై తాము ఎటువంటి కామెంట్లు చేయబోమ‌ని చెబుతోంది. వ్యక్తిగత నెంబర్ల గురించి తాము మాట్లాడ‌బోమ‌ని జ‌వాబు ఇస్తోంది.

  • Loading...

More Telugu News