: ‘ఖైదీ నెంబర్ 150’లో చిరంజీవి ‘స్మార్ట్‌లుక్’ పోస్టర్‌పై రాంగోపాల్ వర్మ కామెంట్
ఎన్నో ఏళ్ల తరువాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తోన్న ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాలో చిరు లుక్కును ఈ రోజు మధ్యాహ్నం విడుదల చేసిన సంగతి తెలిసిందే. స్మార్ట్‌లుక్‌తో చిరు అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ఈ పోస్టర్‌పై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా తనదైన స్టైల్‌లో స్పందించాడు. తాను ఏడేళ్ల కిందట చూసిన చిరంజీవి కంటే ఈ పోస్టర్లో ఆయన ఏడేళ్లు చిన్నగా ఉన్నారంటూ ట్వీట్ చేశాడు. మరోవైపు యువ హీరోలు రామ్‌చరణ్, వరణ్‌తేజ్‌లు ఈ పోస్టర్‌పై స్పందిస్తూ 'బాస్ ఈజ్ బ్యాక్' అంటూ ట్వీట్ చేశారు. చిరు పోస్టర్ పై హీరో సంపూర్ణేష్‌బాబు స్పందిస్తూ, కొందరు వయసుకి తగ్గ పాత్రలు చేస్తారని, చిరంజీవికి మాత్రం పాత్రను బట్టి వయసు డిసైడ్ అవుతుందని అన్నాడు. ఈ పోస్టర్లో చిరంజీవి కనబరుస్తోన్న స్టయిల్‌కి ఆయన అభిమానులు ఫిదా అయిపోతున్నారు. దర్శకుడు వీవీ వినాయక్ రూపొందిస్తోన్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఎన్నో ఏళ్ల తరువాత మళ్లీ థియేటర్లలో హీరోగా కనపడనున్న చిరంజీవిని బిగ్ స్క్రీన్ పై చూడడానికి అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. అభిమానుల అంచనాలకు తగ్గట్లుగానే ఈ చిత్రాన్ని రూపొందిచే పనిలో వీవీ వినాయక్ కష్టపడుతున్నాడు.