: భారీ స్థాయిలో విన్యాసాలకు సిద్ధమవుతోన్న ఇండియన్ నేవీ


సర్జికల్ దాడుల అనంతరం సరిహద్దుల్లో పాక్ సైన్యం కాల్పుల ఉల్లంఘనలు పెరిగాయి. ముఖ్యంగా నిన్నటి నుంచి కాల్పులు మరింత తీవ్రతరమయ్యాయి. పాక్ దాడులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. మరోవైపు పాక్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ పదవీకాలం నవంబర్ చివర్లో ముగియనుంది. దీంతో, రహీల్ దిగిపోయేలోపు పాకిస్థాన్ ఏదైనా దుందుడుకు చర్యకు పాల్పడే అవకాశాన్ని కొట్టి పారేయలేమని ఇంటెలిజెన్స్ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికైనా పూర్తి సన్నద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఇండియన్ నేవీ భారీ స్థాయిలో విన్యాసాలకు సిద్ధమవుతోంది. అరేబియా సముద్రంలో 'పశ్చిమ్ లెహర్' పేరుతో నవంబర్ 2 నుంచి 14 వరకు విన్యాసాలను నిర్వహించనుంది. ఈ విన్యాసాల్లో 40కి పైగా వార్ షిప్ లు, గస్తీ ఎయిర్ క్రాఫ్ట్స్, మెరిటైమ్ ఫైటర్ జెట్స్, సబ్ మెరైన్స్, డ్రోన్స్ పాలుపంచుకోనున్నాయి.

  • Loading...

More Telugu News