: రంగారెడ్డి జిల్లాలో ఒకే కుటుంబంలో ముగ్గురు అదృశ్యం
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఒకేసారి కనిపించకుండాపోయిన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలో చోటుచేసుకుంది. ఆ ప్రాంతానికి చెందిన అశోక్ అనే వ్యక్తి తన కొడుకు హరిప్రసాద్, కూతురు చందనలతో కలిసి ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు. రెండు రోజులయినా తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన అశోక్ తల్లి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వారి అదృశ్యంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.