: కర్ణాటక ఎన్నికలకు సీఎంగారి ప్రచారం


కర్ణాటకలో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ తెగ ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీలో ఏర్పడిన వర్గ విభేదాలను క్యాష్ చేసుకుని అధికార పీఠం ఎక్కాలని ఉవ్విళూరుతోంది. యడ్యూరప్పతో బీజేపీలో ఏర్పడిన కల్లోలాన్ని ఓటర్లలోకి తీసుకెళ్లి తమవైపు తిప్పుకోవాలని వ్యూహాలు వేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉఫాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మంత్రి చిరంజీవి కర్ణాటకలో ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వంతొచ్చింది. మే 5న జరిగే ఎన్నికల కోసం నేడు, రేపు బెంగళూరు శివారు ప్రాంతాల్లో జరిగే కాంగ్రెస్ ప్రచార కార్యక్రమాల్లో కిరణ్ పాల్గొంటారు.

  • Loading...

More Telugu News