: వాస్తవాలు బయటపెట్టండి: ఎఫ్బీఐకి హిల్లరీ సూచన
హిల్లరీ క్లింటన్ ఈ-మెయిల్స్ కేసును మళ్లీ విచారిస్తామని ఎఫ్బీఐ ప్రకటించడంపై ఆమె స్పందించారు. అమెరికాలోని యోవాలోని డెస్ మోయిన్స్ లో ఆమె మాట్లాడుతూ, ఈ మెయిల్స్ వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అధ్యక్ష ఎన్నికల కోసం ఓటింగ్ జరుగుతున్న సమయంలో అన్ని వాస్తవాలను తెలుసుకొనే హక్కు అమెరికన్లకు ఉందని ఆమె చెప్పారు. ఈ మెయిల్స్ విచారణలో ఎటువంటి జాప్యం లేకుండా అన్ని వివరాలను వెల్లడించవలసిన బాధ్యత ఎఫ్బీఐకి ఉందని ఆమె స్పష్టం చేశారు.