: హైదరాబాదులోని గోకుల్ రెస్టారెంట్ లో మంటలు


హైదరాబాదులోని గోకుల్ రెస్టారెంట్ లో అగ్నిప్రమాదం సంభవించింది. మారేడ్ పల్లిలోని గోకుల్ రెస్టారెంట్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది బయటకు పరుగులు తీసి, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో రంగప్రవేశం చేసిన ఫైర్ సిబ్బంది, హోటల్ సిబ్బంది, స్థానికుల సాయంతో మంటలు అదుపులోకి తెచ్చారు. కాగా, అప్పటికే హోటల్ మొత్తం అగ్నికి ఆహుతైంది. అయితే ఈ ఘటనలో ఆస్తి నష్టంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News