: ఈ ఏడాది ప్రధాని దీపావళి చైనా సరిహద్దుల్లో?


ప్రతిఏటా సరిహద్దుల్లో సైనికుల సమక్షంలో పండగలు నిర్వహించుకునే ప్రధాని నరేంద్ర మోదీ ఈ సారి చైనా సరిహద్దుల్లో దీపావళి వేడుకలు నిర్వహించుకోవాలని నిర్ణయించుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో ఇండో-టిబెటన్‌ సరిహద్దు బలగాల (ఐటీబీపీ)తో కలిసి దీపావళి వేడుకలు నిర్వహించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారు. ఉత్తరాఖండ్‌ లోని చమోలీలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఐటీబీపీ సిబ్బందితో కలసి ఆయన దీపావళి పండగ జరుపుకుంటారు. కాగా, గతంలో ఇక్కడే చైనా నిఘా విమానాలు భారత సరిహద్దుల్లోకి చొచ్చుకువచ్చాయన్న కథనాలు వెలువడ్డాయి. దీంతో సైనికుల్లో మరింత ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు ఆయన సరిహద్దుల్లోని చమోలీకి నేడు చేరుకోనున్నారు. ప్రధాని మోదీతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ కూడా వెళతారు. దేశాన్ని నిరంతరం కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికులు, భద్రతా సిబ్బందిలో ఆత్మస్థైర్యం పెంపొందేలా ప్రతి ఒక్కరూ దీపావళి శుభాకాంక్షలు చెప్పాలని ప్రధాని మోదీ కోరిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సైనికులకు శుభాకాంక్షలు తెలిపారు.

  • Loading...

More Telugu News