: బుమ్రా రెడీ...అక్షర్, అమిత్, ధవల్ ఎవరికి మొండిచెయ్యి ?


ఐదో వన్డేలో ఆడేందుకు టీమిండియా యార్కర్ కింగ్ జస్ ప్రీత్ బుమ్రా రెడీ అయ్యాడు. విశాఖపట్టణంలోని పోతినమల్లయ్యపాలెంలోని స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్ లో బుమ్రా యార్కర్లు విసురుతూ ఆకట్టుకున్నాడు. టెయిలెండర్లను యార్కర్లతో బెంబేలెత్తించగల సామర్థ్యం బుమ్రాసొంతం. దీంతో ధోనీ బుమ్రాను బరిలో దించేందుకు సిద్ధమవుతున్నాడు. అతనికి స్థానం కల్పిస్తే...అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా, ధవల్ కులకర్ణిల్లో ఒకరు రిజర్వ్ బెంచ్ కు పరిమితం కావాల్సిందే. బ్యాటింగ్ పిచ్ అయిన విశాఖలో అంతో ఇంతో పరుగులు చేయగల అక్షర్ పటేల్, అమిత్ మిశ్రాలవైపు మొగ్గుచూపేందుకే ధోనీ ఆసక్తి చూపుతున్నాడు. దీంతో ఫైనల్ జట్టులో బుమ్రాకు జట్టులో ఖాయంగా కనిపిస్తోంది. ఈ సిరీస్ కు స్వింగ్ కింగ్ భువనేశ్వర్ విశ్రాంతి తీసుకుంటుండడంతో కొత్త బంతిని బీహార్ స్పీడ్ స్టర్ ఉమేష్ యాదవ్, జస్ ప్రీత్ బుమ్రాలు పంచుకుంటున్నారు. అయితే నాలుగో వన్డేకు బుమ్రా స్థానంలో ధవల్ కులకర్ణికి అవకాశం ఇచ్చాడు ధోనీ. ఆ మ్యాచ్ లో పొదుపుగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. అలాగే చివర్లో బ్యాటింగ్ లో కూడా మెరుపులు మెరిపించాడు. అయినప్పటికీ బుమ్రా వైపు ధోనీ మొగ్గుచూపడం విశేషం.

  • Loading...

More Telugu News