: రతన్ టాటా నాలుగు క్రిమినల్ కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుంది: సుబ్రహ్మణ్యస్వామి
‘టాటా సన్స్’ చైర్మన్ పదవి నుంచి తనను తప్పించడంపై మిస్త్రీ మండిపడుతూ, రతన్ టాటాపై విమర్శలు గుప్పించడం తెలిసిందే. తాజాగా, రతన్ టాటాపై బీజేపీ ఫైర్ బ్రాండ్ సుబ్రహ్మణ్యస్వామి మండిపడ్డారు. మిస్త్రీ బయటపెట్టిన విషయాలే సాక్ష్యమని, వాటిని ఆధారంగా చేసుకుని రతన్ టాటా నాలుగు క్రిమినల్ నేరాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి సుబ్రహ్మణ్యస్వామి ఒక లేఖ రాశారు. నమ్మకానికి భంగం, దుర్వినియోగం నేరం, మనీ లాండరింగ్, కంపెనీ చట్టాల ఉల్లంఘనల కింద నాలుగు క్రిమినల్ కేసులను రతన్ టాటా ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆ లేఖలో తెలిపారు. రతన్ టాటాపై సిట్ తో విచారణ జరిపించాలని, సిట్ లో సీబీఐ, సెబీ, ఎన్ ఫోర్స్ మెంట్ సభ్యులు ఉండాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు. ప్రభుత్వ జోక్యం లేకుండా ఈ విచారణ జరిపించాలని ఆ లేఖలో కోరారు.