: మహిళ కళ్లల్లో కారం చల్లి బంగారం చోరీకి యత్నం.. దేహశుద్ధి చేసిన స్థానికులు
హైదరాబాదు శివారు మేడ్చల్‌లోని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు దొంగలు రెచ్చిపోయారు. బాలాజీనగర్‌లో ఓ మహిళ కళ్లల్లో కారం చల్లి, ఆమె వద్ద నుంచి మూడు తులాల బంగారాన్ని లాక్కున్నారు. తనపై జరిగిన దాడికి భయపడి పోయిన ఆ మహిళ గట్టిగా కేకలు వేసింది. దీంతో స్థానికులు వెంటనే స్పందించి పారిపోతున్న దొంగలను వెంబడించి పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకి సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.