: మిస్త్రీ స్థానంలో వచ్చేదెవరో? పరిశీలనలో పలువురి పేర్లు!
‘టాటా సన్స్’ చైర్మన్ పదవి నుంచి మిస్త్రీని పక్కన బెట్టినప్పటి నుంచి ఆ పదవిలో కొత్తగా ఎవరిని ఎంపిక చేస్తారనే విషయం ఆసక్తిదాయకంగా మారింది. ఈ నేపథ్యంలో నూతన చైర్మన్ ను ఎంపిక చేసేందుకు పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. టీసీఎస్ సీఈవో ఎన్.చంద్రశేఖరన్, టాటా జాగ్వార్ లాండ్ రోవర్ అధినేత రాల్ఫ్ స్పెత్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే, చైర్మన్ పదవికి మిస్త్రీ బావ, ట్రెంట్ లిమిటెడ్ చైర్మన్ నోయెల్ టాటా పేరును కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ‘టాటా సన్స్’ చైర్మన్ పదవికి ఎంపిక విషయమై చంద్రశేఖరన్, రాల్ఫ్ స్పెత్ కానీ, సంస్థ ప్రతినిధులు కానీ ఎటువంటి అధికారిక వివరణ ఇవ్వకపోవడం గమనార్హం.