: మాయావతి ఒత్తిడి తెచ్చినా నేను వినలేదు... ఇక మీరు మా పార్టీలోకి రండి: దయాశంకర్ కు అఖిలేష్ అహ్వానం
బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావతిని వేశ్యతో పోల్చి బీజేపీ నుంచి గెంటివేయబడ్డ దయాశంకర్ సింగ్ ను, ఆయన భార్య స్వాతి సింగ్ ను సమాజ్ వాదీ పార్టీలో చేరాలని అఖిలేష్ యాదవ్ ఆహ్వానించారు. నేడు లక్నోలో ఓ అవార్డు కార్యక్రమం జరుగగా, దానికి అఖిలేష్ వెళ్లారు. ఇక అదే కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన దయాశంకర్, స్వాతిలను ఉద్దేశించి మాట్లాడుతూ, "మిమ్మల్ని అరెస్ట్ చేయాలని మాయావతి నాపై పదే పదే ఒత్తిడి తెచ్చారు. అయినా ఏం జరిగిందో మీకు తెలుసు. అప్పుడైనా, ఇప్పుడైనా బీజేపీ మిమ్మల్ని ఆదుకోలేదు. ఇకపై ఆదుకోదు కూడా. మా పార్టీ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తోంది. సమాజ్ వాదీలోకి రండి" అని అన్నారు.