: ఏఓబీ ఎన్ కౌంటర్ పై విచారణ జరిపించాలి: వైసీపీ డిమాండ్


ఈ నెల 24న ఆంధ్ర-ఒడిశా బోర్డర్ లో జరగిన ఎన్ కౌంటర్ పై ప్రజాసంఘాలు, మీడియా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయని... ఎన్ కౌంటర్ నిజం కాదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోందని... అందువల్ల ఎన్ కౌంటర్ పై విచారణకు ఆదేశించాలని వైసీపీ డిమాండ్ చేసింది. దీనిపై నిష్పాక్షికంగా విచారణ జరగాలని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆమె మాట్లాడుతూ, ఈ మేరకు డిమాండ్ చేశారు. తీవ్రవాదానికి వైసీపీ వ్యతిరేకమని... ఏ పోరాటమైనా రాజ్యంగబద్ధంగా, శాంతియుతంగా ఉండాలనేదే తమ అభిప్రాయమని చెప్పారు. అయితే, అందరూ దీనిపై విచారణ జరపాలని కోరుతున్నారని... అందుకే తాము కూడా విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News