: పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో పుట్టినరోజు నాడే బాలిక మృతి


పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి శివారు ప్రాంతంలో ఈ రోజు విషాదం చోటు చేసుకుంది. ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నీర‌జ అనే 14 ఏళ్ల బాలిక త‌న పుట్టినరోజు నాడే మృతి చెందింది. విద్యుత్‌ లైన్‌మెన్‌గా పనిచేస్తున్న నీర‌జ తండ్రి ఆదిశేఖర్ ఆమెను ద్విచ‌క్ర‌వాహ‌నంపై స్కూలుకి తీసుకెళుతున్న స‌మ‌యంలో ఓ లారీ ఢీకొట్ట‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో ఆదిశేఖర్ తీవ్ర‌గాయాల‌పాల‌యి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు.

  • Loading...

More Telugu News