: ఆర్కే కోసం విస్తృత గాలింపు... రంగంలోకి హెలికాప్టర్లు


ఆంధ్ర-ఒడిశా బోర్డర్ లో మావోయిస్టు అగ్రనేత ఆర్కే కోసం గ్రేహౌండ్స్, స్పెషల్ పోలీస్, బీఎస్ఎఫ్, ఎస్ఓజీ బలగాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. నిన్నటి నుంచి మూడు హెలికాప్టర్లు కూడా గాలింపు చర్యల్లో పాలుపంచుకుంటున్నాయి. కుమడ, రంగబయలు, బుబుశాల, బూసిపుట్ట, బుంగాపుట్ట, సిర్లమెట్ట తదితర ప్రాంతాల్లో గాలింపు కొనసాగుతోంది. పగలూ రాత్రీ తేడా లేకుండా సాయుధ బలగాలు అడవిని జల్లెడ పడుతున్నాయి. మరోవైపు, పోలీసుల అదుపులోనే ఆర్కే ఉన్నారనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News