: ఎన్నికలు రద్దు చేసి, నన్ను విజేతగా ప్రకటించండి: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష ఎన్నికలను వెంటనే రద్దు చేయాలని... తనను విజేతగా ప్రకటించాలని ఆయన అన్నారు. ఎన్నికల్లో హిల్లరీ పార్టీ వారు రిగ్గింగ్ చేస్తారని... మీడియాతో పాటు ఇప్పటికే పాతుకుపోయిన నేతలంతా తన వెనుక కుట్రలు చేస్తున్నారని ఆయన మరోసారి ఆరోపించారు. ఎన్నికలకు మరో రెండు వారాల గడువు మాత్రమే ఉన్న సమయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. మరోవైపు, ట్రంప్, హిల్లరీలు ఇద్దరూ ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు.