: పట్టువదలని పద్మరాజన్... 177వ సారి ఎన్నికల బరిలోకి దిగిన 'ఎలక్షన్ కింగ్'
కె.పద్మరాజన్... ఈ పేరు తెలుగువాళ్లకు తెలియదేమోగానీ, తమిళనాట మాత్రం సుపరిచితమే. సేలంలో ఉండే ఈ 57 ఏళ్ల వ్యక్తి 1988 నుంచి ఏ ఎన్నికలు వచ్చినా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతూనే ఉన్నాడు. స్థానికంగా 'ఎలక్షన్ కింగ్'గా పేరుపడ్డ పద్మరాజన్ ఇప్పటివరకూ 176 సార్లు ఎన్నికల్లో పోటీ చేశాడు. తాజాగా తిరుపరన్ కుంద్రం అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికల్లో పోటీ చేస్తూ, తన రికార్డును తానే తిరగరాసుకున్నాడు. గడచిన మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఏఐఏడీఎంకేకు చెందిన సీనివేల్ విజయం సాధించగా, ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టకుండానే ఆయన మరణించారు. దీంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది.