: చక్రం తిప్పిన డాన్ దావూద్.. అఫ్రిదీకి మొండిచెయ్యి చూపిన పీసీబీ!
పాకిస్థాన్ జట్టులో షాహిద్ అఫ్రిదీ ఎంత కీలకమైన ఆటగాడో అందరికీ తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ లో జట్టు పేలవ ప్రదర్శన కారణంగా కెప్టెన్సీకి రాజీనామా చేసిన అఫ్రిదీకి పరిస్థితులన్నీ శాపంగా మారాయి. ఈ క్రమంలో అఫ్రిదీ దేశద్రోహి అంటూ వెటరన్ జావెద్ మియాందాద్ తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో, అంతే స్థాయిలో అఫ్రిదీ కూడా అతనికి సమాధానం చెప్పాడు. అయితే తన వియ్యంకుడిపై విమర్శలు చేయడంతో మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు ఆగ్రహం కలిగింది. దీంతో పాకిస్థాన్ లో దేనినైనా ప్రభావితం చేయగల దావూద్ పీసీబీని ప్రభావితం చేశాడు. దీంతో ఒక్కసారిగా జట్టులో చోటు కోల్పోవడమే కాకుండా, సీనియర్ క్రికెటర్ గా అందాల్సిన కాంట్రాక్టు కూడా కోల్పోయాడు. ఈ మేరకు క్రికెటర్లకు ర్యాంకులు కేటాయించిన పీసీబీ అఫ్రిదీని మర్చిపోయింది. షాహిద్ అఫ్రిదిని తాజాగా సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి కూడా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తొలగించింది. గత కొన్నేళ్లుగా ఏ-కేటగిరీలో కొనసాగిన అఫ్రిది ఒకేసారి చోటుకోల్పోవడం విశేషం. వెస్టిండీస్ తో టెస్టు సిరీస్ లో సత్తా చాటిన లెగ్ స్పిన్నర్ యాషిర్ షాతో పాటు హఫీజ్, షోయబ్ మలిక్ ఏ-కేటగిరీలో స్థానం సంపాదించారు. అనూహ్యంగా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్లను సైతం సీ-కేటగిరీలో చేర్చిన పీసీబీ అఫ్రిదీని మాత్రం దారుణంగా అవమానించింది. కాగా, ఏ కేటగిరీ క్రికెటర్లకు మ్యాచ్ ఫీజులు, అలవెన్సు, బోనస్ లు కాకుండానే నెలకు 5 లక్షల పాకిస్థాన్ రూపాయలు బోర్డు నుంచి అందనున్నాయి.