: 'మిస్ ఇంటర్నేషనల్'గా ఫిలిప్పీన్స్ ముద్దుగుమ్మ


2016 అంతర్జాతీయ అందగత్తె (మిస్ ఇంటర్నేషనల్ 2016) కిరీటాన్ని ఫిలిప్పీన్స్ కు చెందిన కైలీ వెర్జోసా గెలుచుకుంది. జపాన్ లోని టోక్యో డోమ్ సిటీలో 2016 మిస్‌ ఇంటర్నేషనల్‌ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో ఫిలిప్పీన్స్‌ కు చెందిన కైలీ వెర్జోసా విజేతగా నిలవగా, మొదటి రన్నరప్‌ గా మిస్‌ ఆస్ట్రేలియా బ్రిట్టన్‌, రెండో రన్నరప్‌ గా మిస్‌ ఇండోనేసియా ఫెలీషియా, మూడో రన్నరప్ గా నికరాగ్వా, నాలుగో రన్నరప్ గా మిస్ యునైటెడ్ స్టేట్స్ అందగత్తెలు నిలిచారు. ఈ సందర్భంగా అందగత్తె కైలీ మాట్లాడుతూ, ప్రపంచ దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలపై దృష్టి సారిస్తానని తెలిపింది.

  • Loading...

More Telugu News