: ఆందోళన విరమించి, విధుల్లో చేరండి: హోంగార్డులకు డీజీపీ సూచన


ఉద్యోగ భద్రత, జీతాల పెంపు కోరుతూ ఉద్యమబాట పట్టిన హోంగార్డులు వెంటనే విధుల్లో చేరాలని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ సూచించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, హోంగార్డుల సమస్యలను పోలీసు శాఖ అర్థం చేసుకుంటుందని అన్నారు. హోంగార్డుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. యూనిఫామ్ ఉద్యోగాలు నిర్వహిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా ఆందోళనల బాట పట్టడం సరికాదని ఆయన హోంగార్డులకు హితవు పలికారు. హోంగార్డుల డిమాండ్లను చీఫ్ సెక్రెటరీ, పోలీసు ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారని ఆయన చెప్పారు. అదే సమయంలో హోంగార్డులకు దేశంలోనే అత్యధిక వేతనాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇస్తోందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. హోంగార్డులు తక్షణం ఆందోళనలు విరమించి, విధుల్లో చేరకపోతే చట్టప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

  • Loading...

More Telugu News