: పీవోకే నుంచి తంగ్‌ధర్ సెక్టార్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులు.. కాల్పులు.. జవాను మృతి
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) నుంచి జమ్ముకశ్మీర్‌లోని తంగ్‌ధర్ సెక్టార్‌లోకి చొరబడడానికి ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని భారత జవాన్లు ఈ రోజు తిప్పికొట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక జవాను అక్కడికక్కడే మృతి చెందగా, మరో జవానుకి తీవ్రగాయాలయ్యాయి. ఉగ్రవాదులను హతమార్చడానికి జవాన్లు ప్రయత్నిస్తున్నారు. కాల్పులు కొనసాగుతున్నాయి.