: సైర‌స్ మిస్త్రీ ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేదు: ప్రకటన విడుదల చేసిన టాటా స‌న్స్‌


టాటాగ్రూప్ ఛైర్మన్ ప‌ద‌వి నుంచి సైరస్ మిస్త్రీని త‌ప్పించిన అంశంపై టాటా స‌న్స్ లిమిటెడ్ స్పందించింది. సైర‌స్ మిస్త్రీ ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేదంటూ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఆయ‌న బోర్డు స‌భ్యుల విశ్వాసాన్ని కోల్పోయార‌ని పేర్కొంది. ఈ అంశాన్ని ఒక‌ దుర‌దృష్ట‌క‌ర పరిణామంగా పేర్కొంది. ఛైర్మ‌న్ మార్పు అనే అంశం బోర్డు స‌భ్యులు అంద‌రూ క‌లిసి తీసుకునే నిర్ణ‌యంగా తెలిపింది. అవ‌కాశాలు, స‌వాళ్ల నిర్వ‌హ‌ణ అంశాల‌పై నిర్ణ‌యం తీసుకునేందుకు ఛైర్మ‌న్‌కు బోర్డు అధికారాలు ఇస్తుంద‌ని చెప్పింది. సైర‌స్ మిస్త్రీ అన‌వ‌స‌ర ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని పేర్కొంది.

  • Loading...

More Telugu News