: హేమమాలినిపై లాలూ చేసిన తాజా కామెంట్ కు ట్విట్టర్ లో భారీ స్పందన
గత మంగళవారం నాడు డ్రీమ్ గర్ల్ హేమమాలిని పాట్నాలో ద్రౌపది నాటకం ప్రదర్శించారు. అనంతరం ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ కు థ్యాంక్స్ చెబుతూ, ఆమె కొన్ని ఫొటోలను ట్విట్టర్ లో అప్ లోడ్ చేశారు. దీనిపై లాలూ స్పందించారు. "మీరు మా ఆతిథ్యం స్వీకరించడం మీ గొప్పదనం. మనమిద్దరం మొదటి నుంచి వార్తల్లోనే ఉన్నాం. ఈ జీవితం చాలా చిన్నది. ప్రేమ ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది", అని లాలూ ట్వీట్ చేశారు. లాలూ ట్వీట్ కి ట్విట్టర్ లో మంచి స్పందన వచ్చింది. తమరి మనసు ఇంకా యవ్వనంలోనే ఉందంటూ ఒకరు ట్వీట్ చేశారు. హేమమాలిని మీ ఫస్ట్ క్రష్ అయి ఉంటుందంటూ మరొకరు ట్వీట్ చేశారు. ఇలా లాలూ ట్వీట్ కు భారీ స్పందన వచ్చింది. గతంలో కూడా హేమమాలినిపై తన అభిమానాన్ని లాలూ చాటుకున్నారు. హేమమాలిని బుగ్గలు ఎంత నున్నగా ఉంటాయో, బీహార్ రోడ్లను అలా చేసేస్తానని ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వ్యాఖ్యానించారు.