: మీడియా సమావేశంలో హీరో కార్తీ పెట్టుడు మీసం ఊడిపోయిన వేళ..!


తమిళ హీరో అయినప్పటికీ, తెలుగు ప్రేక్షకులకు తన చిత్రాలతో దగ్గరైన హీరో కార్తీ, తన తాజా సినిమా 'కాష్మోరా' ప్రమోషన్ నిమిత్తం మీడియాతో మాట్లాడుతున్న వేళ, ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది. ఆయన పెట్టుడు మీసం ఊడిపోయి కెమెరాలకు చిక్కింది. ఇప్పుడా సీన్ సోషల్ మీడియాలో వైరల్. తమిళనాడుతో పోలిస్తే, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ థియేటర్లలో 'కాష్మోరా' విడుదలవుతున్న సందర్భంగా కార్తీ మీడియా ముందుకు వచ్చాడు. వాస్తవానికి కార్తీక్ కు మీసం లేదు. టాలీవుడ్ కు చెందినంతవరకూ హీరోయిజానికీ, మీసానికి సంబంధం ఉండటంతో, పెట్టుడు మీసంతో వచ్చాడు. సినిమా గురించి చెప్పుకుంటూ వెళుతుండగా, ఎడమవైపు మీసం జారి కిందకు వచ్చింది. అయినా దాన్ని గుర్తించని కార్తీ మాట్లాడుతూనే వెళ్లాడు. కాసేపటికి మరింతగా జారి పెదవుల పైకి వచ్చినప్పుడు గమనించి, దాన్ని సర్దుకున్నాడు. ఈ ఘటన అక్కడున్న మీడియా వారందరితో పాటు కార్తీకి కూడా నవ్వు తెప్పించింది.

  • Loading...

More Telugu News