: సీఎం చంద్రబాబు సహా ఐదు కోట్ల మంది ప్రజలను రక్షించుకుంటాం: ఏపీ డీజీపీ
ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నామని మావోయిస్టుల నుంచి వచ్చిన లేఖపై ఏపీ డీజీపీ సాంబశివరావు స్పందించారు. సీఎం చంద్రబాబు సహా ఐదు కోట్ల మంది ఆంద్రప్రదేశ్ ప్రజలను రక్షించుకుంటామని గట్టి జవాబిచ్చారు. ఏఓబీలో జరిగిన ఎన్ కౌంటర్ ను బూటకమని ప్రజా సంఘాల నేతలు వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టిన ఆయన, ఏ మాత్రం తేడా వచ్చినా పోలీసులకు తీవ్ర నష్టం జరిగుండేదని అన్నారు. ఈ ఘటనలో పోలీసులకు సైతం గాయాలు అయ్యాయని గుర్తు చేస్తూ, దాదాపు 28 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లిన పోలీసులు సాహసోపేతంగా మావోలను ఎదుర్కొన్నారని వివరించారు. ఎన్ కౌంటర్ అనంతరం ఎవరైనా మావోలు గాయపడివుంటే లొంగిపోవాలని, వారికి చికిత్స చేయించేందుకు సిద్ధమని చెప్పారు.