: నవాజ్ షరీఫ్ కి వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో భారీగా ఆందోళనలు
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో ఆందోళనలు మరింత చెలరేగాయి. బ్లాక్ డే పేరుతో పీవోకేలోని పలు ప్రాంతాల్లో ప్రజలు భారీగా నిరసన ప్రదర్శనలు నిర్వహించి పాక్ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తీరుని ఎండగట్టారు. తమకు స్వేచ్ఛను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తమపై నవాజ్ షరీఫ్ ప్రభుత్వం చేసే దౌర్జన్యాలను సహించబోమంటూ హెచ్చరికలు జారీ చేశారు. పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన తెలిపారు. పలువురిని పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, ఆందోళనకారులకి మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.