: కేజ్రీవాల్ ఢిల్లీలో అడుగుపెట్టగానే ఆయనను కాల్చేస్తామంటూ బెదిరింపు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చండీగఢ్‌లో పర్యటిస్తున్నారు. మరి కొన్ని గంటల్లో ఆయన అక్కడి నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే, కేజ్రీవాల్ ఢిల్లీలో అడుగుపెట్టిన వెంటనే ఆయనను కాల్చిపారేస్తామని గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపులు చేశాడు. ఢిల్లీ పోలీసు అత్యవసర విభాగానికి ఈ బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమయిన అక్కడి పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.