: చాంపియన్స్ ట్రోఫీ హాకీలో దుమ్మురేపిన భారత్.. 2-1గోల్స్‌తో మలేసియాపై విజయం
ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీలో భారత్ విజయాల పరంపరను కొనసాగిస్తోంది. అద్భుత ప్రదర్శనతో ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్న భారత్ బుధవారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో మలేసియాపై 2-1తో విజయం సాధించింది. ఫలితంగా 13 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఒక దశలో 1-1తో ఇరు జట్లు సమానంగా ఉన్న సమయంలో భారత్ జూలు విదిల్చింది. మలేసియాను సమర్థంగా అడ్డుకుంది. మరో రెండు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచిన ఏస్ డ్రాగ్ ఫ్లికర్ రూపిందర్ భారత్‌కు తిరుగులేని విజయాన్ని అందించాడు. ఇప్పటి వరకు మొత్తం ఐదు మ్యాచుల్లో తలపడిన భారత్ నాలుగు విజయాలు, ఒక డ్రాతో అగ్రస్థానంలో నిలిచింది.