: నెలకు 2.5 లక్షల రూపాయలు చెల్లించేలా నా భర్తను ఆదేశించండి: రంభ అనుబంధ పిటిషన్
ఒంటిరి మహిళగా జీవించడం సమాజంలో కష్టంగా ఉందని, తన భర్తతో కలిసి ఉండేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ సినీ నటి రంభ నిన్న చెన్నై కుటుంబ న్యాయస్థానంలో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దానికి అనుబంధంగా నేడు ఆమె మరో పిటిషన్ దాఖలు చేసింది. తన భర్తతో కలిసి జీవించే పిటిషన్ అంశంలో కోర్టు తుది ఉత్తర్వులు జారీచేసే లోపు తనకు నెలకు రెండున్నర లక్షల రూపాయల భృతిని తన భర్త నుంచి ఇప్పించాల్సిందిగా పిటిషన్ లో న్యాయస్థానాన్ని కోరింది. తన భర్తకు కెనడాలో వ్యాపారాలున్నాయని, ఆయన నెలకు 25 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నారని పిటిషన్ లో రంభ పేర్కొంది. సినిమా అవకాశాలు రావడం లేదని, ఇలాంటి సమయంలో తనకు ఇతర ఆదాయ మార్గాలు కూడా లేవని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తన ఇద్దరు కుమార్తెల పోషణ, ఆలనా పాలన, విద్య, ఇతర ఖర్చుల నిమిత్తం నెలకు రెండున్నర లక్షల రూపాయల భృతి ఇచ్చేలా తన భర్త ఇంద్రన్ ను ఆదేశించాలని రంభ పిటిషన్ లో కోరింది.