: కోహ్లీ అవుట్... టీమిండియా @ 109/2


రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా టెస్టు కెప్టెన్, ఛేజింగ్ రారాజు విరాట్ కోహ్లీ విఫలమయ్యాడు. 261 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా కేవలం 19 పరుగులకే రోహిత్ శర్మ (11) వికెట్ కోల్పోయింది. అనంతరం అజింక్యా రహనేతో కలిసి కోహ్లీ స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. అర్ధ సెంచరీకి చేరువయ్యే క్రమంలో సోడీ వేసిన 20వ ఓవర్ 5వ బంతిని ఆడే క్రమంలో వాట్లింగ్ కు క్యాచ్ ఇచ్చిన కోహ్లీ (45) పెవిలియన్ చేరాడు. అనంతరం రహానే (44) కు ధోనీ (1) జత కలిశాడు. న్యూజిలాండ్ బౌలర్లు అద్భుతమైన నియంత్రణతో బంతులు వేస్తూ ఆకట్టుకుంటున్నారు. దీంతో 23 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా 109 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో సౌతీ, సోడీ చెరో వికెట్ తీశారు.

  • Loading...

More Telugu News