: తెలుగు రాష్ట్రాలకు కొత్తగా ఏడుగురు ఐపీఎస్ ల కేటాయింపు


హైదరాబాద్ లోని జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 124 మంది ఐపీఎస్ ల శిక్షణా కాలం ముగిసింది. ఈ నెల 28న పాసింగ్ అవుట్ పరేడ్ జరగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ హాజరుకానున్నట్లు అకాడమీ డైరెక్టర్ అరుణ బహుగుణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, తెలుగు రాష్ట్రాలకు కొత్తగా శిక్షణ పూర్తి చేసుకున్న ఏడుగురు ఐపీఎస్ అధికారులను కేటాయించారు. ఇందులో ఏపీకి నలుగురు, తెలంగాణకు ముగ్గురు అధికారులను కేటాయించారు. అయితే, ఏపీకి కేటాయించిన నలుగురు అధికారుల్లో ఇద్దరు అదే రాష్ట్రానికి చెందిన వారు కాగా, తెలంగాణకు కేటాయించిన ముగ్గురిలో ఒకరు అదే రాష్ట్రానికి చెందిన వారు. వారి వివరాలు.. ఏపీకి.. అజిత వేజెండ్ల (ఏపీ), గౌతమి సాలి(ఏపీ), ఆరిఫ్ హఫీజ్ (కర్ణాటక), బరుణ్ పురకాయస్త (అస్సాం) తెలంగాణకు.. చేతన మైలమత్తుల (తెలంగాణ), రక్షిత కె.మూర్తి (కర్ణాటక), పాటిల్ సంగ్రామం సింగ్ గణపతిరావు (మహారాష్ట్ర)

  • Loading...

More Telugu News