: సూసైడ్ డ్రోన్లను తయారు చేసిన ఇరాన్
అవసరమైతే సూసైడ్ చేసుకోగల డ్రోన్లను ఇరాన్ అభివృద్ధి చేసింది. నీటిపైన, ఉపరితలంపైన ఉన్న లక్ష్యాలను పేల్చివేసే సామర్థ్యం వీటి సొంతమని ఆ దేశానికి చెందిన రివల్యూషనరీ గార్డ్స్ తెలిపింది. నీటిపై అతి తక్కువగా రెండు అడుగుల ఎత్తులో 250 కిలోమీటర్ల వేగంతో ఈ డ్రోన్లు ప్రయాణించగలవు. అత్యధికంగా మూడు వేల అడుగుల ఎత్తుకు కూడా ఇవి ఎగరగలవు. పగలే కాకుండా, రాత్రి పూట కూడా స్పష్టంగా చూడగలిగే ఆత్యాధునిక కెమెరాలను వీటికి అమర్చారు. లక్ష్యాలను నేరుగా ఢీకొట్టి ఇవి నాశనం చేయగలవు. అది కమాండ్ సెంటర్ అయినా, లేదా నౌక అయినా ధ్వంసం చేయగల సామర్థ్యం వీటి సొంతం. అవసరమైతే ఇవి ఆత్మాహుతి దాడులు కూడా చేయగలవు. ప్రాథమికంగా తీర ప్రాంత నిఘా కోసమే ఈ డ్రోన్లను వినియోగిస్తామని రివల్యూషనరీ గార్డ్స్ తెలిపింది.