: స్త్రీ, పురుషుల మధ్య ఆర్థిక సమానత్వం మరో 170 ఏళ్లయినా సాధ్యం కాదట!


స్త్రీ, పురుషుల మధ్య ఆర్థిక సమానత్వం అనేది మరో 170 సంవత్సరాలు గడిచినా సాధ్యంకాదని వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యుఈఎఫ్) పేర్కొంది. ఈ మేరకు వార్షిక జెండర్ గ్యాప్ ఇండెక్స్ నిన్న ఒక నివేదిక విడుదల చేసింది. ఈ లెక్కన చూస్తే 2186 సంవత్సరానికి కూడా స్త్రీ, పురుషుల మధ్య ఆర్థిక సమానత్వం సాధ్యం కాదని తెలిపింది. ఉద్యోగాలు, జీతాలకు సంబంధించి స్త్రీ, పురుషుల మధ్య ఉన్న తేడాను నివారించేందుకు గాను చేస్తున్న ప్రయత్నాలు గత ఏడాది నుంచి కొంచెం తగ్గుముఖం పట్టాయని ఆ నివేదికలో పేర్కొంది. గత ఏడాది నివేదిక ప్రకారం, స్త్రీ, పురుషుల మధ్య ఆర్థిక సమానత్వం అంశానికి సంబంధించి ఉన్న తేడాను 118 సంవత్సరాల్లో అధిగమించవచ్చని పేర్కొంది. కానీ, ప్రపంచదేశాల్లో అందుకు సంబంధించిన అభివృద్ధిలో మార్పు కనపడడం లేదని డబ్ల్యుఈఎఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు సాదియా జాహిది పేర్కొన్నారు. 144 దేశాల్లో స్త్రీ, పురుషులకు సంబంధించి విద్య, ఆరోగ్యం, జీవనోపాధి, ఆర్థిక అవకాశాలు, రాజకీయ సాధికారత వంటి అంశాలకు సంబంధించి ఏ మేరకు అభివృద్ధి సాధించారని చూడగా, ఐస్ లాండ్, ఫిన్ లాండ్ దేశాలు ఎక్కువ ర్యాంకులు సాధించాయని పేర్కొంది. ఆ తర్వాత స్థానాల్లో నార్వే, స్వీడన్, రువాండా ఉన్నట్లు పేర్కొంది. ఈ జాబితాలో కింద ఉన్న దేశాల్లో యెమెన్, సిరియా, సౌదీ అరేబియా, ఇరాన్ ఉన్నాయి. కాగా, మహిళలకు రాజకీయ సాధికారత విషయంలో అగ్రరాజ్యం అయిన అమెరికా 73వ ర్యాంకు సాధించినట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News