: అవసరమైతే వెయ్యిసార్లు మైకు లాగుతా... వందసార్లు బల్లలు ఎక్కుతా: ఆళ్ల


ఏపీకి ప్రత్యేక హోదా సాధించడమే తమ లక్ష్యమని... దీనికోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధమని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ రోజు ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరైన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాపై తమ పోరు కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఇందులో భాగంగానే అసెంబ్లీని స్తంభింపజేశామని తెలిపారు. స్పెషల్ స్టేటస్ సాధించేందుకు అవసరమైతే వందసార్లు బల్లలు ఎక్కుతామని, వెయ్యిసార్లు మైకులు లాగుతామని చెప్పారు. టీడీపీ బెదిరింపులకు తాము భయపడమని అన్నారు. ప్రజాప్రతినిధుల పార్టీ ఫిరాయింపుల కేసును పట్టించుకోని ప్రభుత్వం... తమ విషయంలో మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని విమర్శించారు.

  • Loading...

More Telugu News