: ప్రివిలేజ్‌ కమిటీ సమావేశానికి గైర్హాజరైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. సమాధానం ఇచ్చుకున్న ఐదుగురు సభ్యులు


గత అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రత్యేక హోదాపై చర్చకు పట్టుబడుతూ స్పీక‌ర్ పోడియం వ‌ద్ద ప‌లువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరు పట్ల స‌మాధానం చెప్పాల‌ని ప్రివిలేజ్‌ కమిటీ నోటీసులు జారీ చేసిన విష‌యం తెలిసిందే. ఈ రోజు ప్రివిలేజ్‌ కమిటీ ముందు ఐదుగురు స‌భ్యులు హాజ‌ర‌యి వివ‌ర‌ణ ఇచ్చారు. ఈ సమావేశానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హాజ‌రుకాలేదు. క‌మిటీ ముందు ఈ రోజు ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి, ముత్యాల నాయుడు, సునీల్‌, సంజీవ‌య్య, కంబాల జోగులు స‌మాధానం చెప్పారు. క‌మిటీ ముందు నిన్న‌ ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, దాడిశెట్టి రాజా, జగ్గిరెడ్డి, శివప్రసాద్‌రెడ్డి హాజ‌రై స‌మాధానం చెప్పిన సంగ‌తి తెలిసిందే. సభాహక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని వీరిపై అభియోగాలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News