: సికింద్రాబాద్‌లో నేడు 8 గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిపివేత


సికింద్రాబాద్‌లో నేడు 8 గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్టు విద్యుత్ శాఖ అధికారులు పేర్కొన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. జేమ్స్ స్ట్రీట్‌లో సబ్ స్టేషన్ పరికరాలను మారుస్తున్న కారణంగా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్టు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కోత ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు. సికింద్రాబాద్ పరిధిలోని అస్రానీ హోటల్, రీగల్ స్టోర్స్, ఏపీ పేపర్, హార్డీ కాంప్లెక్స్, పార్శీ కాంపౌండ్, చంద్రలోక్, ఓరియంటల్ బ్యాంకు, ఎమరాల్డ్ హౌస్, ఖండోజీ బజార్, కలాసీగూడ, గాంధీ విగ్రహ ప్రాంతం, పోస్టాఫీసు, సింధు బ్యాంకు, రోచా బజారు, కేడియో హౌస్, సుభాష్ రోడ్డు, వెస్లీ జూనియర్ కాలేజీ, జవహర్ నగర్, శ్యాం హోటల్, స్వాతి హోటల్, అమర్ పెట్రోలు బంకు, సరోజినీదేవీ రోడ్, స్వప్నలోక్ కాంప్లెక్స్ ప్రాంతాల్లో బుధవారం విద్యుత్ సరఫరా ఉండదని అధికారులు వివరించారు.

  • Loading...

More Telugu News