: గడ్డం గీయించుకున్న హీరోయిన్,, వీడియో వైరల్!


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రంలో విలన్ కు భార్యగా నటించిన సంజన ఇప్పుడు గడ్డం చేయించుకుంది. కంగారుపడద్దు.. ఈ విషయం వాస్తవమే.. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే, హీరో గడ్డం చేయించుకుంటాడు కానీ, హీరోయిన్ గడ్డం చేయించుకోవడమేంటా అనే అనుమానం తలెత్తడం సహజమే. అయితే, కొందరు మహిళల ముఖంపై అవాంఛిత రోమాలు వస్తుంటాయి. సాధారణ మహిళలు అయితే ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ, సంజన వంటి హీరోయిన్ ముఖంపై కూడా అవాంఛిత రోమాలు ఉంటే తన గ్లామర్ పై కేర్ తీసుకోకతప్పదుగా, అందుకే, తన వ్యక్తిగత మేకప్ మెన్ తో గడ్డం గీయించుకుంది. వెండితెరపై మరింత అందంగా కనపడటానికి, ఎప్పటికప్పుడు నీట్ గా గడ్డం గీయించుకుంటోంది. షేవింగ్ క్రీమ్ ఉపయోగించకుండా తన మేకప్ మెన్ తో సంజన గడ్డం గీయించుకుంటున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.

  • Loading...

More Telugu News