: సైరస్ మిస్త్రీకి అపాయింట్ మెంట్ ఇవ్వని రతన్ టాటా
టాటా గ్రూప్ ఛైర్మన్ గా నిన్నటి వరకు వెలుగొందిన సైరస్ మిస్త్రీకి ఊహించని పరాభవం ఎందురైంది. సైరస్ మిస్త్రీని ఒక్కసారిగా తొలగించడంపై సైరస్ తండ్రి పల్లోంజీ మిస్త్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రతన్ టాటా నిర్ణయాన్ని బాంబే హైకోర్టులో సవాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో నేడు టాటా గ్రూప్ డైరెక్టర్లతో రతన్ టాటా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలోపు తనకు ఇంటర్వ్యూ ఇవ్వాలని రతన్ టాటా ను సైరస్ మిస్త్రీ కోరారు. దీనికి ససేమిరా అన్న రతన్ టాటా గ్రూప్ డైరెక్టర్లతో సమావేశమయ్యారు. అలాగే టాటా గ్రూప్ సీఈవోలతో కూడా ఆయన సమావేశమయ్యారు. దీంతో కనీసం ఇంటర్వ్యూకు కూడా ఆయన అవకాశం ఇవ్వకపోవడంతో మిస్త్రీపై రతన్ టాటాకు ఉన్న విముఖతను అర్ధం చేసుకోవచ్చని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి.