: సీఎంగా అఖిలేషే వుంటారు... మేమంతా ఒకే ఫ్యామిలీ, కలిసే ఉన్నాం: ములాయం


కుటుంబం మొత్తం కలిసే ఉందని సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తెలిపారు. లక్నోలో ఆయన మాట్లాడుతూ, తామంతా ఒకే ఫ్యామిలీ అని, ప్రతి విషయాన్ని చర్చించుకుంటామని, ఎవరి అభిప్రాయాలు వారు చెబుతారని అన్నారు. పార్టీ, కుటుంబం యొక్క లక్ష్యం ఒక్కటేనని ఆయన అన్నారు. అఖిలేష్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ ఇమేజ్ ను మార్చిన వ్యక్తి అని ఆయన కొనియాడారు. అఖిలేషే సీఎంగా కొనసాగుతారని ఆయన స్పష్టం చేశారు. ప్రతి సందర్భంలోనూ అమర్ సింగ్ ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతాలకు కట్టుబడి పని చేస్తున్నామని ఆయన తెలిపారు. పార్టీ, కుటుంబం లక్ష్యం ఒకటేనని ఆయన చెప్పారు, బయటివాళ్లే తమ మధ్య గొడవలు సృష్టిస్తున్నారని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News