: నిట్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లి ఉగ్రవాదిగా మారాడు!


ఆ కుర్రాది పేరు షజీర్. కాలికట్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చ‌దువుకున్నాడు. 2002లో సివిల్ ఇంజినీరింగ్ (బీటెక్‌) ప‌ట్టా అందుకున్నాడు. అనంతరం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో నిపుణుడ‌య్యాడు. ఆ తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్లి గౌర‌వప్ర‌ద‌మైన ఉద్యోగంలో చేశాడు. అయితే, అత‌డి గురించి ఆయ‌న కుటుంబ‌స‌భ్యుల‌కు తాజాగా ఓ విష‌యం తెలిసింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో త‌మ కుమారుడు చేరాడని తెలుసుకొని వారు షాక్‌కు గుర‌య్యారు. కేరళ వాసి అయిన‌ షజీర్ ఉగ్ర‌వాదులతో చేతులు క‌లిపాడ‌ని గుర్తించిన అధికారులు ఈ విష‌యాన్ని మూజిక్కల్‌లోని ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు తెలిపారు. షజీర్‌ది మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబం. అత‌డి తండ్రి ప‌దేళ్ల క్రితం మ‌ర‌ణించాడు. ఆయ‌న‌కు ఇద్దరు అక్కాచెల్లెళ్లు, ఓ తమ్ముడు ఉన్నారు. బాగా చ‌దువుకున్న ష‌జీద్‌ విదేశాల్లో మంచి ఉద్యోగం చేస్తున్నాడ‌నుకుంటున్న వారికి పోలీసులు ఈ విష‌యాన్ని తెలిపారు. తాము షజీర్ పంపిస్తున్న డబ్బుతోనే బ‌తుకుతున్నామ‌ని వారు పేర్కొన్నారు. తమకు ఉగ్ర‌వాద సంస్థ‌లు అంటే ఏమిటో కూడా తెలియ‌ద‌ని చెప్పారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు కొన్ని రోజుల క్రితం కర్ణాటకలో ఐఎస్ ఉగ్రవాద సంస్థ కేరళ మాడ్యూల్‌ను గుర్తించారు. దీనికి నాయకుడు షజీర్ అని భావిస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థతో క‌లిసి ఉగ్ర‌ కార్య‌క‌లాపాలకు పాల్ప‌డుతున్నాడ‌ని, ఓ యాప్ ద్వారా ఆ సంస్థ‌లోని నేత‌ల‌తో మాట్లాడుతున్నాడ‌ని చెప్పింది. సోష‌ల్‌మీడియా సైట్‌ ఫేస్‌బుక్‌లోనూ ‘సమీర్ అలీ’ అకౌంట్ ద్వారా మలయాళంలో ఉగ్ర‌వాదంపై ష‌జీర్‌ ప్రచారం చేస్తున్నాడ‌ని ఎన్ఐఏ కు తెలిసింది.

  • Loading...

More Telugu News