: 15 ఏళ్ల తర్వాత మాజీ ప్రియుడితో కలిసి షోలో పాల్గొంటున్న ఐశ్వర్య రాయ్!


దాదాపు 15 ఏళ్ల తర్వాత మాజీ ప్రియుడు సల్మాన్ ఖాన్ తో కలిసి హాట్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ కనిపించబోతోంది. తన తాజా చిత్రం 'యే దిల్ హై ముష్కిల్' ప్రమోషన్ లో భాగంగా సల్మాన్ నిర్వహిస్తున్న బిగ్ బాస్ షోకు ఐశ్వర్య గెస్ట్ గా హాజరవుతోంది. మాజీ ప్రేమికులు మళ్లీ ఒకే వేదికపై కనిపించనుండటం ఇప్పుడు బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. పెళ్లి తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఐశ్వర్య... తాజాగా తన సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతోంది. రెండో ఇన్నింగ్స్ లో ఒకటి రెండు సినిమాలు చాలా హుందాగా చేసినప్పటికీ, 'యే దిల్ హై ముష్కిల్' సినిమాలో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. యంగ్ హీరో రణబీర్ కపూర్ తో హాట్ హాట్ సన్నివేశాలలో నటించి, అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు, సరైన కథ ఉంటే తన మాజీ లవర్ సల్మాన్ కు జంటగా నటించడానికి కూడా తాను రెడీ అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. కథ రెడీ అవడానికి ఇంకా టైమ్ పడుతుందని భావించిందో ఏమో గానీ, బుల్లితెరపై సల్మాన్ తో కలసి కనిపించేందుకు రెడీ అయిపోయింది.

  • Loading...

More Telugu News