: రాజీనామా చేయడానికి కూడా వెనుకాడను: ఎంపీ బుట్టా రేణుక


ఏపీకి ప్రత్యేక హోదా సాధించడం కోసం జగన్ ఎంచుకున్న మార్గంలోనే తాము కూడా నడుస్తామని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక అన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం తమ అధినేత అహర్నిశలు పనిచేస్తున్నారని తెలిపారు. స్పెషల్ స్టేటస్ సాధించే క్రమంలో ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి కూడా తాను వెనుకాడనని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలంతా ప్రత్యేక హోదాను కోరుకుంటుంటే... అధికార తెలుగుదేశం పార్టీ మాత్రం రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతోందని ఆరోపించారు. భవిష్యత్ తరాలు బాగుండాలంటే, ప్రత్యేక హోదా సాధించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.

  • Loading...

More Telugu News