: నయీంతో మాజీ మంత్రి శ్రీధర్ బాబుకు సంబంధాలు: మంథని ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపణలు


ఇటీవలే ఎన్ కౌంటర్ కు గురైన గ్యాంగ్ స్టర్ నయీంతో మాజీమంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు సంబంధాలు ఉన్నాయని పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే పుట్ట మధు తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై విచారణ జరిపించాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, డీజీపీ అనురాగ్ శర్మలకు ఫిర్యాదు చేస్తానని ఆయన చెప్పారు. మాజీ స్పీకర్, ఆయన తండ్రి శ్రీపాదరావు హత్య కేసులో సంబంధాలు ఉన్న వ్యక్తులను హతమార్చేందుకు నయీమ్ తో శ్రీధర్ బాబు దోస్తీ చేశారని ఆరోపించారు. ఈ క్రమంలోనే, మాజీ మావోయిస్టు జడల నాగరాజు ఆచూకీ లేకుండా పోయాడని తెలిపారు. మంథనిలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, నయీమ్ తో తనకు సంబంధాలున్నాయన్న ఆరోపణల్లో వాస్తవం లేదని శ్రీధర్ బాబు తెలిపారు. అతను చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే తనపై పుట్ట మధు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

  • Loading...

More Telugu News