: మహిళపై వేధింపుల కేసును ఛేదించిన పోలీసులు.. అనూహ్యంగా పట్టుబడిన పరిటాల రవి హత్యకేసు నిందితుడు


మహిళపై వేధింపుల కేసును విచారిస్తున్న పోలీసులకు పరిటాల రవి హత్యకేసులో నిందితుడైన బత్తిన వెంకటేశం అనూహ్యంగా పట్టుబడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాదులోని కేపీహెచ్‌బీ కాలనీ తొమ్మిదో ఫేజ్‌లో ఉంటున్న ధరణీదేవి తల్లికి పటోళ్ల గోవర్థన్ రెడ్డి భార్య వింధ్యారెడ్డి రూ.25 లక్షలు అప్పు ఇచ్చింది. ఆ తర్వాత ఆమె అప్పును చెల్లించింది. అయినా ఇటీవల వింధ్యారెడ్డి ఐదుగురితో కలిసి ధరణీదేవి ఇంటికి వెళ్లి తీసుకున్న అప్పును చెల్లించాలని బెదిరించడంతో ఆమె అవాక్కయింది. వారి బెదిరింపులు భరించలేక ధరణీదేవి కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితురాలు వింధ్యారెడ్డి, ఆమె కారు డ్రైవర్ కన్నయ్యతోపాటు పరారీలో ఉన్న బత్తిని వెంకటేశం, కొండా నరేశ్, కోయాడ రాముగౌడ్, మందల రవిలను అరెస్ట్ చేశారు. సిద్ధిపేటకు చెందిన బత్తిన వెంకటేశం పరిటాల రవి హత్య కేసులో నిందితుడు. చాలా రోజులుగా తప్పించుకుని తిరుగుతున్న వెంకటేశం ఈ కేసులో పట్టుబడ్డాడు. నిందితుల నుంచి కారు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News